IPLలో CSK ఘన విజయం Mr. కెప్టెన్ కూల్ ఎమోషనల్
దాదాపు రెండు నెలలపాటు ఎంతో ఉత్కంఠగా సాగిన IPL సీజన్ ఎట్టకేలకు ముగిసింది. కాగా ఈ సీజన్లో IPL ట్రోఫీని ఎవరు దక్కించుకుంటారా అనే క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు కూడా తెరపడింది. నిన్న జరిగిన CSK VS GT ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో GT పై CSK విజయం సాధించింది. దీంతో CSK టీమ్ 5 వసారి ట్రోఫీని దక్కించుకొని ముంబయి ఇండియన్స్ టీమ్‌కు సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. CSK టీమ్ ప్లేయర్స్‌తోపాటు సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా Mr. కెప్టెన్ కూల్ ధోని సైతం విజయం సాధించిన ఆనందంలో ఎమోషనల్ అయ్యారు. అయితే మ్యాచ్‌ను చివరి వరకు ఆసక్తిగా తిలకించిన ధోని.. ఆల్ రౌండర్ జడేజా లక్ష్యాన్ని ఛేదించడంతో అతన్ని ఎత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఈ వీడియోను హ్యాపీ టియర్స్ పేరుతో CSK టీమ్ ట్వీట్ చేసింది.

