Home Page SliderNationalNews Alert

కరోనా విజృంభణ… కేంద్రం అత్యవసర సమావేశం..

చైనా, అమెరికా, సహా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్‌ అలర్ట్‌ అయింది. ప్రపంచ దేశాల్లో వైరస్‌ పరిస్థితులపై అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో నీతి అయోగ్‌ సభ్యులు, ఇతర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్‌, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు హాజరయ్యారు. పలు దేశాల్లో ఉత్పన్నమవుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్లపై అధికారులు సమీక్షలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇప్పటికే అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. అయితే.. చైనా సహా జపాన్‌, సౌత్‌ కొరియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10 కోట్లు దాటింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది.