Trending Today

దోసెతో ఛోలె, సమోసాతో సాంబార్ భలే కాంబినేషన్

‘మనిషికో పుర్రె, జిహ్వకో రుచి’ అన్నారు. మనం సాధారణంగా ఒక రకమైన ఆహార పదార్థాన్ని దానికి సరిపోయే ఏదైనా కాంబినేషన్‌తో ఆరగిస్తుంటాము. దోసెతో చట్నీ, ఇడ్లీతో సాంబార్, పూరీతో ఛోలె వంటివి రొటీన్ కాంబినేషన్ అయిపోయాయనుకున్నాడేమో ఒక మహానుభావుడు. సమోసాతో సాంబార్‌ని, దోసెతో ఛోలెని మిక్స్ చేసి, తినేస్తూ ట్విటర్‌లో వైరల్ అయిపోతున్నాడు. ఇంకా కొంతమంది కూల్‌డ్రింక్‌లో ఐస్ క్రీమ్‌ని, ఫ్రూట్ జ్యూస్‌లో కారాన్ని కలిపి లాగించేస్తున్నారు. నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్‌లలో కాంబినేషన్లు కలిపేస్తూ వ్యూయర్స్ చేత లొట్టలు వేయిస్తున్నారు.