Home Page SliderTelangana

హైదరాబాదులో ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాదులోని రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమెదముద్ర వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్‌షా అధ్యక్షతన కేంద్రమంత్రుల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. RRRకు సమాంతరంగా ఈ ప్రాజెక్టు కూడా ఉండబోతోంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టని, హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీని నిర్మాణానికి సర్వే కోసమే 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. దీనితో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రూట్ విషయంలో దాదాపు 90 శాతం క్లారిటీ ఉందన్నారు. దీనివల్ల వ్యాపార, వాణిజ్య రవాణా రంగాలలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మెదక్, వరంగల్, ముంబై రైల్వే లైన్లకు ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్‌ను అనుసంధిస్తారని,  దీనితో రవాణా అతి సులభంగా జరుగుతుందని పేర్కొన్నారు.