కారు బీభత్సం.. ఆరుగురు మృతి
ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాప్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మృతులను నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం.

