Home Page SliderTelangana

మాటలు తప్ప.. చేతలు బీఆర్ఎస్‌కు లేవు

నల్గొండ: స్మార్ట్ సిటీ యోజన కింద నల్గొండ పురపాలికకు రూ.400 కోట్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇస్తే ఆ నిధులన్నింటినీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. నల్గొండ జిల్లా శివన్నగూడెం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను నిర్మించకుండా రైతులను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభ విజయవంతమైందని ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.