బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది మధ్యతరగతికి అందనంత ఎత్తుకి ఎదిగిపోతోంది పసిడి. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఏడాది ఔన్స్ బంగారం 3,150 డాలర్లకు చేరుకోవచ్చని, గ్లోబల్ కంపెనీలు జోస్యం చెప్తున్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల బంగారం ధరలు పెరిగాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. దీనితో బంగారంపై పెట్టుబడులకు త్వరపడాలని, రాబోయే రోజులలో కొనలేమని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. వచ్చే ఏడాదికి అటుఇటుగా బంగారం ధర 10 గ్రాములు లక్ష రూపాయలకు చేరవచ్చు.

