Andhra PradeshHome Page SliderNews Alert

అదిరిపోయిన బ్రో టైటిల్‌.. ఫ్యాన్స్‌కి పూనకాలే

Share with

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఆయన మేనల్లుడు హీరో సాయిధర్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా మోషన్‌ పోస్టర్‌ కోసం సంగీత సంచలనం తమన్‌ అందించిన నేపథ్య సంగీతం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. గురువారం ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ సినిమాకు ‘బ్రో’ అనే టైటిట్‌ ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వినోదాయ సిథం’ అనే తమిళం సినిమాకి ఇది రీమేక్‌. తమిళ భాషలో ఈ సినిమా సూపర్‌ హిట్‌ను అందుకుంది.