Telangana

అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో గీతా ఆర్ట్స్ భారీ మూవీ

Share with

మెగా అభిమానులకు అల్లు అరవింద్ గుడ్ న్యూస్ చెప్పారు. స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో భారీ మల్టీ స్టారర్ సినిమాను చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన టైటిల్‌ను ఎప్పటినుండో బ్లాక్ చేసి ఉంచారు. చరణ్ అర్జున్ అనే టైటిల్‌ను 10ఏళ్లుగా ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఇది వేరే వాళ్లకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానని తెలిపారు. ఇంతకు ముందే వీరి కాంబినేషన్‌లో ఎవడు అనే సినిమా వచ్చింది. వీరిద్దరూ కలిసి కొన్ని సీన్లలో నటించారు.

ఎవరైనా మంచి కథతో వస్తే తాను ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమన్నారు. వారిద్దరి ఇమేజ్‌కు తగినట్లు కథ ఉండాలని, వారు పూర్తి స్థాయిలో అభిమానులను అలరించేలా సినిమా తీస్తానని పేర్కొన్నారు. అయితే సినిమాకు మిగిలిన కాస్టింగ్, దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమా కూడా RRR తరహాలో భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా.