Home Page SliderNational

సెబీ చీఫ్‌పై ఆరోపణలు-ఉద్యోగుల ఆందోళన

Share with

సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌పై పలు ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఈ మధ్యనే అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీలో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయనంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్ నుండి ఆమెకు జీతం వస్తోందని విమర్శిస్తోంది. వీటితో పాటు సొంత సంస్థలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగులుతోందనట్లు ఉద్యోగులు ఆమెపై వ్యతిరేకంగా లేఖ రాయడంతో అడకత్తెరలో పోకచెక్కలా అయ్యింది ఆమె పరిస్థితి. ఇది బయటి వ్యక్తులు చేసిందేనని సంస్థ వివరణ ఇవ్వడంతో ఉద్యోగులకు ఆగ్రహం పెరిగిపోయింది. దీనితో సెబీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. ఉద్యోగులకు అమలులో సాధ్యం కానీ భారీ లక్ష్యాలు నిర్దేశిస్తున్నారని, నలుగురి ముందూ తిట్టడం, పరువు తీయడం సాధారణం అయిపోయిందని ఆమెను విమర్శిస్తున్నారు. ఈ లేఖ బయటి వ్యక్తులు రాసింది కాదని, మాధవి పురి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  ఈ ఆందోళనలో 500 మంది ఉద్యోగులు పాల్గొని ఉండవచ్చని, గంటపాటు విధులు బహిష్కరించారని మనీ కంట్రోల్ వెబ్‌సైట్ పేర్కొంది.