హైదరాబాద్ HICC లో AI గ్లోబల్ సమ్మిట్ 2024
హైదరాబాద్ HICC లో AI గ్లోబల్ సమ్మిట్ 2024 కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్‌లో ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AI కి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సు లో ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఐటీమంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. “Making AI work for every one” అనే థీమ్ తో సదస్సు నిర్వహిస్తున్నారు.