చరిత్రలో నిలిచిపోయే ఒప్పందాలు మాహాయాంలోనే!
ఆదానితో సోలార్ ఒప్పందాల ప్రచారం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వారి ఆలోచనల్లో వైసీపిని ఎలా ఇబ్బంది పెట్టాలన్న కార్యక్రమం తప్ప…ఇచ్చిన హామీలను నెరవేర్చుదామన్న ధ్యాసే లేకుండా పోయిందన్నారు. ఈ ఐదు నెలల కాలంలో అరాచకం సృష్టించారని ఆగ్రహించారు.కేసులు,అరెస్టులు,దాడులు తప్ప ఎక్కడైనా పరిపాలన అనేది కనిపించిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ ని కారు చౌకగా కొనుగోలు చేశామని ,అప్పటి ఒప్పంద పత్రాలను జగన్ మీడియా సమక్షంలో ప్రదర్శించారు. రూ.2.49 లకు యూనిట్ విద్యుత్ కొనుగోలు అనేది ఒక హిస్టరీ అన్నారు.ఇలాంటి హిస్టారికల్ రూలింగ్ ఒక్క వైసీపి హయాంలోనే జరిగిందన్నారు. రూ.5.10ల నుంచి రూ.2.49లకు యూనిట్ ధర తగ్గడమంటే ఆషామాషీ కాదన్నారు.కేంద్రాన్నికి,వైసీపి ప్రభుత్వానికి జరిగిన ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి(ధర్డ్ పార్టీ) అనేదే లేదన్నారు.ఇంతటి సుపరిపాలన అందిస్తే జగన్ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని అబద్దాలు చెబుతున్నారంటూ చంద్రబాబు పై మండిపడ్డారు.