Home Page SliderInternational

ప్రధాని మోదీకి రష్యాలో ఘనస్వాగతం

ప్రధాని మోదీ నేడు రష్యాలోని కజాన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రష్యా నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఆయన రష్యాకు చేరుకున్నారు. ఆయన ఈ సందర్భంగా పలు దేశాల అధినేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. సమాన రీతిలో ప్రపంచ అభివృద్ది అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. అక్టోబర్ 22,23 నాడు ఈ సమావేశాలు జరుగుతాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక సమావేశం జరుపుతారని సమాచారం.