Home Page SliderNational

కారుపై బీభత్సంగా పిడుగుపాటు

రోడ్డుపై ఓ కారుకు దగ్గరలో భయంకరంగా పిడుగు పడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ఎటునుండి ఉరుములు, మెరుపులు, పిడుగులు వస్తున్నాయో అంటూ జనం వణకిపోతున్నారు. భారీ వర్షాలకు ఇళ్లు, వాకిళ్లు మునిగి నిరాశ్రయులవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ వీడియో చూసిన వారు అమ్మో ఎంత బీభత్సంగా ఉందో ఈ పిడుగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఎవరు పోస్టు చేశారో , ఈ పిడుగు ఏ ప్రదేశంలో పడిందో అనే విషయాలు తెలియదు. కానీ ఈ వీడియోకు దాదాపు లక్షన్నర వ్యూస్ వచ్చాయి. ఒక అగ్నిగుండం లాగ, నిప్పుల బంతిలా ఈ మెరుపు, పిడుగు కనిపించాయి. స్లోమోషన్ వీడియో అంటూ దీనిని ట్విటర్‌లో పోస్టు చేశారు ఎక్స్‌ప్లోషన్ వీడియోస్ అనే గ్రూప్. పిడుగుపడిన అనంతరం నల్లని పొగ కారు వెనుక లేచింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా భయాందోళనలకు గురవుతున్నారు.