Home Page SliderNationalSports

సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ

Share with

ఈ IPL సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది కీలక ప్లేయర్స్ గాయాల కారణంగా ఆటకు దూరమౌతూ..వస్తున్నారు. ఈ నేపథ్యంలో SRH జట్టుకు కూడా ఇలాంటి షాకే తగిలింది. అదేంటంటే ఈ జట్టులో కీలక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ IPL సీజన్  మొత్తానికి దూరమయ్యారు. కాగా సుందర్‌కు తగిలిన గాయం కారణంగా ఆయన రానున్న అన్ని  మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేరని SRH వెల్లడించింది. అయితే సుందర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు SRH పేర్కొంది. మరోవైపు ఈ IPL సీజన్ ప్రారంభం నుంచి SRH పరాజయాల పాలవుతూనే ఉంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టులో కీలక ప్లేయర్ సుందర్ ఆటకు దూరమవ్వడంతో SRH కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ నేపథ్యంలో SRH యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది.