Home Page SliderNationalSports

సినిమాల్లోకి  ప్రముఖ స్టార్ క్రికెటర్

Share with

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ ఈ IPL సీజన్‌లో గుజరాత్ టైటన్స్ జట్టు తరుపున ఆడుతూ.. అదరగొడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ ప్లేగ్రౌండ్‌లో తన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అయితే శుభ్‌మన్ తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆయన యాక్టర్‌గా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవతారమెత్తాడు. ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమాకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదనే చెప్పాలి. దీంతో ఈ స్పైడర్ మ్యాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో అనువాదం చేయబడుతుంది. దీనిలో భాగంగానే “స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్”  చిత్రాన్ని మన దేశ భాష హిందీ..అలాగే పంజాబీలో కూడా అనువాదం చేశారు. అయితే “స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్”  చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రకు శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను సోనీ పిక్చర్స్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో శుభ్‌మన్ గిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా శుభ్‌మన్ గిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.