home page sliderHome Page SliderNationalviral

విడాకులైన వ్యక్తికి.. కన్య వధువు కావాలట

ఒక బిలియన్ డాలర్ల కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్, తన రెండో పెళ్లి కోసం మ్యాచ్‌మేకర్ ఒండ్రిలా కపూర్‌ను సంప్రదించాడు. తనకు కాబోయే భార్య 30 ఏళ్ల లోపు ఉండాలని, బ్రాహ్మణ వర్గానికి చెందిన వధువై ఉండాలి, అన్నింటికంటే ముఖ్యంగా ఆమె గతంలో ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో ఉండని ‘కన్య’ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు.”మీకు ఇప్పటికే విడాకులయ్యాయి కదా, మరి అమ్మాయి విషయంలో ఈ నిబంధనలు ఎందుకు?” అని మ్యారేజ్ బ్రోకర్ ప్రశ్నించగా.. అతను ఇచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేసింది. “నేను పురుషుడిని, కాబట్టి నా విషయంలో ఆ పోలిక సరైనది కాదు” అని అతను బదులిచ్చాడు. పురుష అహంకారంతో కూడిన అతని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. “అతని ప్రవర్తన చూస్తుంటే మొదటి భార్య ఎందుకు విడాకులు ఇచ్చిందో అర్థమవుతోంది” అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. సదరు వ్యక్తి డిమాండ్లు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతూ మ్యాచ్‌మేకర్ అతని ప్రొఫైల్‌ను తిరస్కరించారు. మన సమాజంలోని పితృస్వామ్య ధోరణికి, ద్వంద్వనీతికి ఈ ఘటన నిదర్శనమని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.