Home Page SliderInternationalmoviesTrending Today

‘చుట్టమల్లే’.. పాట పాడిన బ్రిటిష్ పాప్ సింగర్

బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ తాజాగా బెంగళూరులోని తొలి ప్రదర్శనలో ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను పాడారు. బ్రిటిష్ సింగర్ నోట తెలుగు పాట రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు. ‘మీ గొంతులో ఈ పాట వినడం చాలా సంతోషంగా ఉంది. సంగీతానికి హద్దులు ఉండవు. మీరు ఈ విషయాన్ని మరోమారు నిరూపించారు. ఇది నిజంగా ప్రత్యేకమైనది’. అంటూ పాప్ సింగర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆరేళ్ల అనంతరం ఎన్టీఆర్ సోలో హీరోగా రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దేవర చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యంగ్ టైగర్‌లు నటించిన  చుట్టమల్లే పాట సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

https://twitter.com/NMeklaNTR/status/1888641459504509081