Home Page SliderTelangana

వీల్ చైర్ లో రష్మిక జర్నీ..

వీల్ చైర్ లో హీరోయిన్ రష్మిక మందన్న హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో కనిపించింది. ఆమెను చూసిన జనం షాక్ కు గురయ్యారు. అయితే.. రష్మిక కొద్ది రోజుల క్రితం జిమ్ లో వర్కవుట్ చేస్తూ కాలికి బలమైన గాయమైంది. ఆ గాయంతో రష్మిక తెగ ఇబ్బంది పడుతోంది. అతి కష్టంతో ఆమె ఇవాళ ఉదయం ముంబై కి బయలుదేరి వెళ్లింది. రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో కార్ లో నుండి దిగి వీల్ చైర్ లో వెళ్తున్న వీడియో బయటికి వచ్చింది. ఇందులో రష్మిక ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత, కారు దిగేందుకు ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అలాగే ఆమె కుంటుతూ, తన టీం సభ్యుడి సపోర్ట్ తో వీల్ చైర్ లో కూర్చుంది. అలా తోటివారి సహాయంతో ఎయిర్ పోర్టు ప్రాంగణం లోపలికి వెళుతున్నవీడియో వైరల్ అవ్వడంతో రష్మిక గాయం చాలా పెద్దదని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో రష్మిక ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.