ఒక యాక్సిడెంట్-రెండు కుటుంబాల విషాదం
ఒక యాక్సిడెంట్ ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాలలో విషాదం నింపింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారిపల్లెకు చెందిన ముల్క ఉదయ్, పత్తి నర్సింహ అనే ఇద్దరు వ్యక్తులు ఆదివారం రాత్రి ఈ యాక్సిడెంట్‌లో మృతి చెందారు. సర్వీసు రోడ్ల వద్ద ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీనితో వీరిద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. ముల్క ఉదయ్ భోపాల్‌లో ఆర్మీ జవానుగా పని చేస్తున్నారు. అతని భార్య డెలివరీ కోసం పది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. సోమవారం ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారు. కానీ, ఇంతలోనే పాపం బిడ్డను చూసుకోకుండానే అతడు అకాల మృత్యువు పాలవ్వడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. పత్తి నర్సింహ అనే వ్యక్తి నస్పూర్ కాలనీలో చికెన్ సెంటర్ నిర్వహిస్తుంటారు. తన సోదరుని అత్త మృతి చెందడంతో భార్య రమాదేవితో కలిసి అక్కడికి బయలుదేరారు. అంతలోనే ఈ యాక్సిడెంట్ జరగడంతో మృతి చెందారు. అతని భార్య రమాదేవికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

