పోలీస్ అమరుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం
అమరులైన పోలీస్ కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు. ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అలాగే మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. విధినిర్వహణలో అంగవైకల్యం పొందిన వారికి కూడా పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.

