YCP పార్టీలోని మాజీలు టిడిపిలోకి జంప్: గంటా
AP: వైసీపీ పార్టీ మునిగిపోయే నావ వంటిదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీలో వైఎస్ జగన్ తప్ప ఎవరూ మిగలరని, మిగిలిన అందరూ ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీ పతనానికి జగనే ప్రధాన కారణం. ఆయన ఒంటెత్తు పోకడలతో ఆ పార్టీ నేతలు టీడీపీలోకి జంప్ జిలానీలుగా క్యూ కడుతున్నారు. ఆయన ఏనాడు ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఆయన ప్రవర్తన సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్లే ఉండేది. వైసీపీ పార్టీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేరాలి అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.