బంగారం ధరపై యూఎస్ ఫెడ్ సిగ్నల్స్
బంగారం కొనాలంటే ఇదే సరైన సమయం అని యూఎస్ ఫెడ్ తెలిపింది. సెప్టెంబరులో వడ్డీ రేట్లు తగ్గించడానికి యూఎస్ ఫెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో అప్పుడు బంగారం ధర పెరిగే సూచనలు ఉన్నాయి. బంగారం, డాలర్ ధరల మధ్య వ్యతిరేక సంబంధం ఉంది. ఒకటి ధర తగ్గితే, ఒకటి ధర పెరగవచ్చు. వడ్డీరేట్ల కోతతో బంగారం మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. ఇప్పుడు యుద్ధాలు, జియో పాలిటిక్స్ వల్ల భారత్, చైనాలు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నాయి. ఇప్పటికే భారత్ బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో డిమాండ్ బాగా పెరిగింది.

