Andhra PradeshHome Page Slider

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ముగిసిన జగన్ ధర్నా

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ ధర్నా తాజాగా ముగిసింది. అయితే జగన్ ధర్నాకు 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్‌వాదీ, ఐయూఎంల్, అన్నాడీఎంకే, శివసేన, టీఎమ్‌సీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా, వీసీకే, ఆప్ పార్టీలు జగన్ ధర్నాకు మద్దతుగా నిలిచాయి. కాగా ఏపీలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు.