హైదరాబాదులో ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాదులోని రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమెదముద్ర వేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమిత్షా అధ్యక్షతన కేంద్రమంత్రుల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. RRRకు సమాంతరంగా ఈ ప్రాజెక్టు కూడా ఉండబోతోంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టని, హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీని నిర్మాణానికి సర్వే కోసమే 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. దీనితో హైదరాబాద్కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రూట్ విషయంలో దాదాపు 90 శాతం క్లారిటీ ఉందన్నారు. దీనివల్ల వ్యాపార, వాణిజ్య రవాణా రంగాలలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మెదక్, వరంగల్, ముంబై రైల్వే లైన్లకు ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ను అనుసంధిస్తారని, దీనితో రవాణా అతి సులభంగా జరుగుతుందని పేర్కొన్నారు.

