Andhra PradeshHome Page Slider

జనసేన పార్టీలో ఉత్సాహం నింపిన అధినేత – వారాహి యాత్రతో జనసేన పార్టీలో కొత్త ఊపు

ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆ పార్టీకి క్యాడర్లో కథనోత్సహాన్ని నింపుతోంది. వారాహి యాత్ర ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతుంది. జనసేన పార్టీ అత్యధికంగా ప్రాబల్యం ఉంటుందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలలో ఆ పార్టీ అధినేత పర్యటనతో జనసేన క్యాడర్లో కథనోత్సాహం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ స్వయంగా జనసేన అధినేత ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు చేస్తూ వస్తున్నారు. కాకినాడ పర్యటన పూర్తి చేసుకొని బుధవారం అంబేద్కర్ కోనసీమకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ముమ్మిడివరం నియోజకవర్గం లో ఘన స్వాగతం లభించింది. ప్రధానంగా కోనసీమలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటుంది. గోదావరి జిల్లాలలో కూడా అనేక నియోజకవర్గాలలో ఈ సామాజిక వర్గం ఓటర్లే కీలక భూమిక పోషిస్తారు. గోదావరి జిల్లాల ఓటర్లు ఏ వైపు మోగితే ఆ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరుతున్నదనేది ఒక నమ్మకంగా అనేకసార్లు సైతం రుజువు  అయ్యింది. గోదావరి జిల్లాలలో సత్తా చాటగలిగితే తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవే ర్చుకోవచ్చనేది ఆయన  వ్యూహంగా కనిపిస్తుంది. ఇక యాత్రలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో తాము ఏం చేయగలమో స్పష్టంగా చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణిని నిర్వహిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా రైతులు, కార్మికులు, మత్స్యకారులు ఇలా అన్ని వర్గాలతో సమావేశమై వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్ర ద్వారా తాను గుర్తించిన అంశాలనే జనసేన మ్యానిఫెస్టోలో పెట్టేలా వ్యూవహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రెట్టించిన ఉత్సాహంతో అధినేత పర్యటన విజయవంతానికి కృషి చేస్తున్నారు. ఈసారి ఎన్నికలకు పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్టం చేయటం ద్వారా జనసేన సత్తా ఏమిటో చూపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది.