కేసీఆర్ అంటే కాల్వలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు
కేసీఆర్ అంటే కాల్వలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అంటున్నారు తెలంగాణా ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణాలో కరువు తీరిపోయిందన్నారు. తెలంగాణా భూమిని సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేన్నారు. ఆయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని, కాళేశ్వరం చంద్రశేఖర్‌రావని ప్రశంసించారు. కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు పైగా భూములకు నీరందుతోందన్నారు. సాగునీటి సంబరాలు కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ అపరభగీరధుడని కొనియాడారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతమంతా గోదావరీ జలాలకు లక్షమందితో జనహారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

