Home Page SliderTelangana

లక్షమందితో గోదావరికి జనహారతి

Share with

తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాగునీటి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. సూర్యాపేట జిల్లాలో గోదావరికి లక్షమందితో జనహారతులు పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణా మంత్రి జగదీశ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఆయన పిలుపు మేరకు ఏడు మండలాలలో ప్రజలు ఈ జనహారతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గోదావరి జలాలకు జనహారతులు ఇస్తున్నారు. కాళేశ్వరం కాలువల వెంబడి వంటా,వార్పూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాంతాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. కాళేశ్వరం జలాలు దాదాపు 68 కిలోమీటర్ల మేర కాలువల రూపంలో ఈ ప్రాంతాలలో విస్తరించాయి. హారతులతో పాటు చీరలు కూడా గోదావరికి సమర్పిస్తున్నారు. ఆ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సూర్యాపేట నియోజక వర్గప్రజలు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.