నేటి నుండి సెలవులు షురూ
తెలంగాణా పదవతరగతి పరీక్షలు నిన్నటితో ముగిసాయి. ఈ రోజు నుండి విద్యార్థులకు సెలవులు ప్రారంభం అయ్యాయి. మే31 వరకు సెలవులు ఉన్నాయి. 2023-2024 వ విద్యా సంవత్సరానికి జూన్ 1 నుండి ఇంటర్ ప్రారంభం కానుంది. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఒకేరోజు ప్రారంభం అవుతాయి. పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నుండి ప్రారంభం అవుతుంది. ఈ నెల 21 వరకు ఈ మూల్యాంకనం జరగనుంది. మే 10 తర్వాత పరీక్షా ఫలితాలు వెల్లడి కావచ్చని అంచనాలు వేస్తున్నారు. దీనితో పదవతరగతి పరీక్షలు పూర్తయిన విద్యార్థులు కాలేజీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

