Andhra PradeshBreaking News

చంద్రబాబు పై సజ్జల కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాల్సిందేనన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక రాజకీయ నటుడు అని విమర్శించారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదని ఆరోపించారు. చంద్రబాబుని జనం పట్టించుకోవడం మానేశారు కాబట్టి రోజుకోక పాట్లు పడుతున్నారని విమర్శించారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, పోలీసులు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుందని సజ్జల సూచించారు. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్‌ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని ఆయన హితవుపలికారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని, కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని తెలియజేసారు. చంద్రబాబు పోలీసుల పట్ల బెదిరింపు ధోరణికి దిగటాన్ని తప్పుపట్టారు.

కుప్పంలో జరిగింది ఏంటి?

టీడీపీ నేతలు వాట్సాప్‌ ద్వారా డీఎస్పీకి ఓ మెసేజ్‌ పంపించారు. అక్కడ సెక్షన్‌ 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉంది. ముందుగా మీరు సభ ఎక్కడ పెడతారో చెబితే మేం అనుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారని వివరించారు. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి తీసుకోవాలని డీఎస్పీ మెసెజ్‌ చేస్తే ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు. చట్టానికి కట్టుబడి ఉంటారా? వెలుపల ఉంటారా?. నీవు వెలుపల ఉంటాననంటే పోలీసులు అడ్డుకుంటారు. కుప్పంలో చంద్రబాబు పోలీసు అధికారిపై వేలు చూపిస్తూ దబాయించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారు. మైక్‌ పర్మిషన్‌ లేకపోవడంతో వాహనాన్ని తీసుకెళ్లారు. చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేస్తే ఊరికోవాలా? చంద్రబాబు హుంకారాలు దేనికి నిదర్శనం. ఇవన్నీ ప్రజలు గమనించాలి అని విన్నవించారు.