Andhra PradeshNews

పవన్‌ కల్యాణ్‌ హత్యకు 250 కోట్ల సుపారీ

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ హత్యకు 250 కోట్లతో స్కెచ్‌ వేశారని ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన రెక్కీ కూడా చేశారని వెల్లడించారు. ప్రాణాలు తీయాలనే నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారని బొండా ఉమ ఆరోపించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సహకరించిన వారిపై దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులు పెట్టడమే జగన్‌ విధానం అని వ్యాఖ్యానించారు. పవన్‌ బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్థులు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ రెడ్డి పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ప్రశ్నించినందుకు అయ్యన్నపాత్రుడిని సీబీసీఐడీ పోలీసులు దండుపాళ్యం బ్యాచ్‌ లా వెళ్లి అరెస్ట్‌ చేశారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి వక్ఫ్‌భూములను కబ్జా చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు బొండా ఉమ.