Home Page SliderNationalNewsNews AlertTrending Today

పెళ్లి కోసం ఒత్తిడి.. ప్రియుడి దారుణం

బీహార్‌లోని నలంద జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఓ మహిళను, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె ప్రియుడు బైక్‌తో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నర్దిగంజ్‌లో భూ సర్వే అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల రాజ్‌గిర్‌లో తన ప్రియురాలిని కలిశాడు. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోవడానికి అతడు ప్రయత్నించగా, మహిళ అడ్డుకుంది. అయితే బైక్ ఆపకుండా ఆమె చేతిని పట్టుకుని సుమారు 100 మీటర్ల వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.

దీంతో మహిళ సహాయం కోసం కేకలు వేయగా, కొద్దిసేపటికే బైక్ అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. తప్పించుకునేందుకు ఆ మహిళ తన భార్య అని, కుటుంబ గొడవ కారణంగా ఈ ఘటన జరిగిందని చెప్పేందుకు అతడు ప్రయత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనను ఓ వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.