NationalNews

ఆర్మీ స్కెచ్‌కి చిక్కిన 21 ఏళ్ల ఫేక్ బ్రిగేడియర్!

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. కేవలం 21 ఏళ్ల వయసున్న ఒక యువకుడు ఏకంగా ఇండియన్ ఆర్మీ ‘బ్రిగేడియర్’ అని చెప్పుకుంటూ తిరుగుతూ, చివరకు అసలు సైన్యం వేసిన వలలో చిక్కి జైలు పాలయ్యాడు.

నిందితుడిని రాహుల్ ఖాన్ అని గుర్తించారు. అతను నకిలీ ఐడెంటిటీ కార్డ్స్, ఆర్మీ యూనిఫామ్‌తో స్థానిక కంటోన్మెంట్‌ ఏరియాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారులు ఒక పక్కా వ్యూహం సిద్ధం చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ లోపలికి రమ్మంటూ అధికారులు అతనికి గాలం వేశారు. నిజమైన బ్రిగేడియర్ లాగే ఫీలవుతూ రాహుల్ ఖాన్ నేరుగా వెళ్ళాడు.

తీరా లోపలికి వచ్చాక అధికారులు అతని పత్రాలను పరిశీలించగా, అవన్నీ నకిలీవని తేలింది. దీంతో ఆర్మీ వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ వయసులోనే అతను అంత పెద్ద పదవిని ఎలా ఫోర్జరీ చేశాడనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.