తమిళనాడులో విజయ్ అద్భుత అరంగేట్రం
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే సాగుతున్న ద్రవిడ రాజకీయ పోరును నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ బద్దలు కొట్టింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్, ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అద్భుతమైన ఆరంగేట్రం చేశాడు. అధికార డీఎంకే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ తనవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. విజయ్ కున్న మాస్ ఇమేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ ఈ భారీ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 50 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి.

