Breaking NewsTelanganaTGRTC

చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం సచివాలయంలో జేఏసీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యింది. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించే అవకాశం ఉంది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడవనున్నాయి. గత కొన్ని రోజులుగా సమ్మె కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సమ్మె విరమణకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రవాణా అంతరాయానికి తెరపడనుంది. ప్రభుత్వం, జేఏసీ మధ్య కుదిరిన ఏకాభిప్రాయంపై కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.