Home Page Sliderhome page sliderTelangana

హిందువులు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలి..

హిందువులు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దంటూ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సూచించారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని, దేశం, ధర్మం లేకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. అందుకే హిందువులు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన సంఖ్య పెరగాలన్నారు. ముస్లింలు పిల్లలను కంటున్నారు కదా.. హిందువులు కూడా కంటే తప్పులేదని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.