మెహదీపట్నంలో కాల్పుల కలకలం..
హైదరాబాద్ మెహదీపట్నం వద్ద గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి గన్‌తో ఫైరింగ్ చేయడంతో కలకలం రేగింది. అక్కడ కింగ్స్ ప్యాలెస్‌లోని ట్రేడ్ ఎక్స్‌పో జరుగుతుండగా, ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ జరుగుతుండడంతో ఉద్రేకం చెందిన నసీరుద్ధీన్ అనే వ్యక్తి తన వద్దనున్న గన్‌తో కాల్పులు జరిపారు. దీనితో పోలీసులు అతని వద్దనున్న గన్‌ను స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి గన్ లైసెన్స్ ఉందని, గొడవ కారణంగా కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేశారు.

