సెక్రటేరియట్ పై డ్రోన్ కలకలం
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగరేసిన ఇద్దరిని గుర్తించారు. నిందితులు వంశీ, నాగరాజును సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

