Home Page Sliderhome page sliderPoliticsTelangana

హింసను ప్రేరేపిస్తే ఉపేక్షించొద్దు


బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజమెత్తడం

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం తీవ్ర చట్టవ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలనడం రాష్ట్ర ప్రజలను అగౌరవపరచడమేనని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడొకరు బహిరంగ వేదికపై నిలబడి.. సింగరేణి భవనాలను తగులబెట్టండి, రైల్వే పట్టాలు కోయండి అంటూ ‘మిలిటెంట్ యాక్టివిటీ’కి పిలుపునివ్వడం అత్యంత ప్రమాదకరమని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సింది పోయి, యువతను హింస వైపు ప్రేరేపించడం బీఆర్ఎస్ అసలు నైజాన్ని బయటపెట్టిందని, ఈ అపరిపక్వ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన అసహనంతోనే ఆ పార్టీ సమాజంలో అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.