NationalNews

పంజాగుట్ట పీఎస్‌లో రామ్ గోపాల్ వర్మ రచ్చ…

Share with

టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా లడ్కీ సినిమాను నిర్మించారు. ఆయన ఈ సినిమాను ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాపై శేఖర్ రాజు అనే వ్యక్తి స్టే తీసుకురావడంతో సినిమాను నిలిపివేశారు. దీనిపై ఆర్జీవీ మాట్లాడుతూ హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు అనే వ్యక్తి తనపై ఆరోపణ చేశాడని… అదే విధంగా కోర్టును తప్పు దారి పట్టించాడని ఆర్జీవీ విమర్శించాడు. మూవీ ఆపేందుకు… శేఖర్ రాజు స్టే తెచ్చారని… తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని తెలిపారు. దానికి సంబంధించిన పత్రాలను పంజాగుట్ట పోలీసులకు ఇచ్చానన్నారు ఆర్జీవీ.  అన్యాయంగా కేసు వేయడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. ఏదేమైన సరే సినిమా ఆపడం బ్యాడ్ థింగ్ అన్నారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టానని అన్నారు. అలాగే ఈ సినిమా ఆపేయడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చిందో వారందరూ శేఖర్ రాజుపై కేసు పెడతారని కూడా తెలిపారు. సినిమా ఆపినవారి ఎండ్ చూస్తానని.. దీనిపై చాలా సీరియస్‌గా ఫైట్ చేస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు. శేఖర్ రాజుకు వ్యక్తిగతంగా… తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు. శేఖర్ రాజు  బ్లాక్ మెయిల్ చేసి సెటిల్‌మెంట్ చేసుకుందామనే కుట్ర చేశారని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు.