home page sliderHome Page SliderSports

మెస్సీపై ప్రశ్నలకు రొనాల్డో రియాక్షన్


ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సిల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా వీరిద్దరి మధ్య గట్టి వార్ నడుస్తుంటుంది. తాజాగా వరల్డ్ కప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మెస్సి ప్రస్తావన రావడంతో రొనాల్డో కాస్త అసహనానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే… ఆరోసారి ప్రపంచ కప్ బరిలోకి దిగిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన రొనాల్డో.. రెండో మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై రెండు సూపర్ గోల్స్ సాధించి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0 తో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు గోల్స్‌తో ఆరు వరల్డ్ కప్‌ల్లో గోల్స్ సాధించిన ఏకైక ప్లేయర్‌గా రొనాల్డో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో రొనాల్డో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చాడు. కానీ అక్కడ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు అతనికి చిరాకు తెప్పించాయి. ఒక జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతూ.. “నిన్న లియోనెల్ మెస్సి రెండు గోల్స్ చేశాడు.. ఎంబప్పే కూడా…” అని ఇంకా ప్రశ్న పూర్తి చేయకముందే రొనాల్డో అసహనంతో తన తలను మరోవైపు తిప్పేసుకున్నాడు. ఆ జర్నలిస్ట్‌ను ఆపేసి, వేరే రిపోర్టర్‌ను ప్రశ్న అడగమని సూచించాడు. అంతేకాదు.. “మీరు అడిగే ప్రశ్నను బట్టే.. నా సమాధానం ఉంటుంది. లేకపోతే లేదు” అని తేల్చిచెప్పాడు. టోర్నీలో అర్జెంటీనాతో మ్యాచ్ ఆడాల్సి వస్తే ఎలా భావిస్తారు? అనే ప్రశ్నకు రొనాల్డో స్పందిస్తూ.. “ఇప్పుడు ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఇది అర్థం లేని ప్రశ్న. కానీ, ఆ జట్టుతో మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది” అని రిప్లై ఇచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకొని రొనాల్డో వెళ్తుండగా.. మరో విలేకరి “మెస్సి హ్యాట్రిక్ కొట్టాడు” అని గట్టిగా అరిచాడు. దానికి రొనాల్డో నడుస్తూనే.. “ఇతరుల గురించి నేను పెద్దగా పట్టించుకోను” అంటూ ఘాటుగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.