బియ్యం పంపిణీలో కేసీఆర్ సర్కారు విఫలం
బియ్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని , దీనితో బియ్యం సేకరణ నిలిపివేయడంపై కేంద్ర ప్రజా పంపీణీ వ్యహారాల శాఖ తాజా గా ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నయోజన పథకంపై ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తుందని స్పష్టం చేసింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని పేర్కొంది. దీనికి పాల్పడిన మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మిల్లర్లు ఈ అక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపింది. అన్న యోజన పథకం కింద ఏప్రిల్ – మే నెలల కోటా(PMGKAY) క్రింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను తెలంగాణ ప్రభుత్వం తీసుకోగా … మే 21 న జరిగిన తనిఖీల్లో 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామంది.
మిగిలిన బియ్యాన్ని కూడా లబ్దిదారులకి సరిగా పంపిణీ చేయలేకపోవడం దారుణమని కేంద్రం ఆక్షేపించింది. తప్పనిసరి పరిస్ధితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం పంపిణీ నిలిపివేశామంది. వీటిపై తక్షణమే యాక్షన్ టేకెన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం FCI కి అందిస్తేనే… సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.