ఊసరవెల్లి కింద పనిచేయలేకే రాజీనామా- సోనియాకు లేఖ
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మనోవేదనను అనుభవించి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసినదే. ఆయన పార్టీకే కాక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. అందులో తాను 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తగా పని చేసానని, ఏ పని ఇచ్చినా సంతోషంగా పార్టీ ఉన్నతి కోసం చేసానని, కష్టాలను దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం పాటుపడ్డానని పేర్కొన్నారు. సోనియాను విమర్శించిన వారికి ముఖ్య పదవులను అప్పగించారని, తాను అలాంటి వారికింద పని చేయలేనని ఆ లేఖలో తెలియజేసారు. అలాంటి వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారనీ, రంగులు మార్చే ఊసరవెల్లి వంటి వారని అన్నారు. ఈ మాటలు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే అని అర్ధమవుతున్నాయి.
Read more: మోదీకి భయపడడం లేదు : రాహుల్ గాంధీ