జరీన్‌కు ప్రత్యేక సన్మానం
కామన్వెల్తె గేమ్స్ లో తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటారు. పసిడి పతకంతో అదరగొట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ జరీన్‌ను అభినందించారు. అంతే కాకుండా ఆమెకు గ్లౌజులను బహుకరించి మోదీ ప్రత్యేకంగా సన్మానించారు. ఇటీవలే ఆ క్రీడా సంబరాలు ముగియగా.. క్రీడాకారులంతా ఇండియా చేరుకున్నారు. వీరందరినీ ఢిల్లీకి పిలిపించి మోదీ క్రీడాకారులను అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరఫున పాలుపంచుకున్న క్రీడాకారులతో ప్రత్యేకంగా మోదీ భేటీ అయ్యారు. వారి ప్రతిభను కీర్తించారు.