NationalNews

స్టాక్ మార్కెట్ దిగ్గజం జుంజున్ వాలా కన్నుమూత

Share with

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం 6.45 నిమిషాల సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలోనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గత వారం కిడ్నీ సంబంధింత సమస్యలతో ఆయన బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. ముంబై దలాల్ స్ట్రీట్ లో పెట్టుబడులు పెట్టడంలో రాకేష్ జున్‌జున్‌వాలాకు మంచి గుర్తింపు ఉంది. ఫోర్బ్స్ మేగజైన్ అంచనా ప్రకారం ఆయనకు 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్నాయ్. వాటి విలువ ఇండియా రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా రూ. 18 వేల కోట్లు.

అకాశ ఎయిర్ లైన్స్‌లో పెట్టుబడులు పెట్టిన రాకేష్ రంజన్ గత వారమే సర్వీసులు మొదలుపెట్టింది. ఆకాశ ఎయిర్ లైన్స్ ఆరంభం సమయంలో ఆయన వీల్ చెయిర్‌లో రావడంతోనే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జున్‌జున్‌వాలా జులై 5, 1960న జన్మించారు. ఆయన భార్య రేఖ జంజన్ వాలా సైతం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా గుర్తింపు పొందారు. రాకేష్ జున్‌జున్‌వాలా అలుపెరగని వ్యక్తి అని పూర్తి జీవితం… సాహసాలతో కూడిందని చెప్పారు ప్రధాని మోదీ. స్టాక్ మార్కెట్ నిర్వహణ, ఆర్థిక ప్రపంచంలో ఆయన ముద్ర సుస్పష్టమన్నారు. ఇండియా అభివృద్ధి చెందాలని బలంగా కోరుకునే వ్యక్తి అని మోదీ కితాబిచ్చారు.

రాకేష్ జున్‌జున్‌వాలా చరిత్ర పాఠాలు

రాకేష్ జున్‌జున్‌వాలా చరిత్ర పాఠాలురాకేష్ జున్‌జున్‌వాలాను ఇండియా వారెన్ బఫెట్ అని ముద్దుగా పిలుస్తారు. జూలై 5, 1960న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన ముంబైలో పెరిగారు.

సిడెన్‌హామ్ కళాశాల నుండి గ్రాడ్యూయేషన్ పూర్తయ్యాక… ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరి… స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రేఖా జున్‌జున్‌వాలాను వివాహం చేసుకున్నాడు.

జున్‌జున్‌వాలా భారతదేశ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గా గుర్తింపు పొందారు. ఆయన కొన్న షేర్లు భారీగా ఆస్తులు పోగేసుకునేందుకు కారణమయ్యాయి.

జున్‌జున్‌వాలా RARE ఎంటర్‌ప్రైజెస్ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని స్టాక్ ట్రేడింగ్ సంస్థ నిర్వహిస్తున్నారు. అకాసా ఎయిర్‌ వేస్ ను ప్రారంభించి తన అభిలాషను చాటుకున్నాడు.

విమానయాన రంగం బాగా చిక్కుల్లో ఉన్నప్పుడు ఎందుకు ప్రారంభిస్తున్నారని అంటే… ఓటమిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానంటూ చమత్కరించారు.