ఐర్లాండ్ జట్టుకు కెవిన్ ఒబ్రెయిన్ షాక్
కెవిన్ ఒబ్రెయిన్ ట్విట్టర్ వేదికగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఐర్లాండ్ స్టార్ క్రికెటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒబ్రెయిన్ తన క్రికెట్ జీవితానికి రిటర్మెంట్ పలుకుతున్నట్టు తన ట్విట్టర్‌లో ఫ్రకటించారు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్తూ , టీ 20 ప్రపంచకప్ తర్వాత వైదొలగాలని భావించినట్టు తెలిపాడు. కానీ ప్రస్తుత సెలక్టర్లు తనను పక్కన పెట్టిన కారణంతో చాలా బాధ పడ్డనని , అందుకే ఈ రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఒబ్రెయిన్ 153 వన్డేలు , 110 టీ20 ల్లో 5,592 రన్స్ చేసాడు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ట్విట్టర్ వేదికగా వీడ్కోలు తెలియపరిచాడు.
ఒబ్రెయిన్ 2006 ఐర్లాండ్ యెక్క ప్రారంభ మ్యాచ్‌లో తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు. అయితే ప్రస్తుతం ఒబ్రెయిన్ ఐర్లాండ్ , లీన్‌స్టర్ , రైల్వే యూనియన్ క్రికెట్ క్లబ్‌ల కోసం ఆడుతున్నాడు. అంతేకాకుండా ఇతను అనేక ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లకు ఆడాడు. కాగా 2009 లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ఆడిన ఒబ్రెయిన్ , 2010లో క్రికెట్ ఐర్లండ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బోర్డుతో పూర్తి సమయం ఒప్పందం ఉన్న అతి కొద్దిమంది ఆటగాళ్ళల్లో ఒకరిగా ఉన్నాడు. ఒడీఐలలో ఐర్లాండ్ తరపున 100 వికెట్లు తీసిన మెదటి ఆటగాడు ఇతనే. ఇంతలో ఒబ్రెయిన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ఐర్లాండ్ జట్టుకు ఓ షాక్ అనే చెప్పోచ్చు.