NewsTelangana

ప్రమాదంలో ఉస్మానియా ఆస్పత్రి

Share with

వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ప్రస్తుత పరిస్ధితిలో ఆసుపత్రిగా వినియోగించేందుకు సురక్షితం కాదని , పురాతన భవనం కావడంలో దానిని ఆసుపత్రిగా వాడడం అంతా మంచిది కాదని భావిస్తున్నట్టు నిపుణుల కమిటీ సిఫారుసు చేసింది. అయితే కొన్ని మరమతులు చేయడం ద్వారా భవనం జీవిత కాలం పెరుగుతోందని… అయినప్పటికి ఆసుపత్రికి మినహాయించి ఇతర అవసరాలకు దానిని ఉపయోగించుకోవచ్చంది. వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నందున దీని పరిక్షణ , మరమత్తుల బాధ్యతను ఆర్కిటెక్ట్‌ల పరిరక్షణలో చేపట్టాలంది. ఆసుపత్రిగా వాడుకునేందుకు ఎన్నో మార్పులు చేయాల్సి ఉందని… ముఖ్యంగా ఆసుపత్రి వినియోగానికై దానిలో ఆక్సిజన్ పైపులైన్ , గ్యాస్ పైపులైన్ , ఏసీ కనెక్షన్స్ , వాటర్ ఫెసిలిటీ వంటి సౌకర్యాలు కల్పించాల్సి వస్తుందని తెలిపింది. వీటి నిర్మాణం , భవన పటిష్ఠతపై ప్రభావం చూపుతాయంది. ఇప్పటికే శిథిలావస్ధలో ఉన్నందున దీనిని కూల్చి కొత్త భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేయాలని కొందరు అంటుంటే , దీన్ని కూల్చకుండా పరిరక్షణ చేపట్టాలని మరికొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ … జస్టిస్ నందల ధర్మాసనం విచారణ చేపట్టింది. గత కమిటీ నివేదికలు సమర్పించిందని , ప్రభుత్వ నిర్ణయానికి కొంత గడువు కావాలని ఏజీ కోరారు. ఈ విచారణకు సంభందించిన కాపీలను పిటిషనర్లతో పాటుగా ప్రతివాదులకు అందచేయాలని , అందరు అధ్యయనం చేశాక దీనిపై విచారణ చేపడతామని విచారణను ఆగఘ్ట 25కి వాయిదా వేసింది.       

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్ అండ్ బీ , పంచాయితీరాజ్ , ప్రజారోగ్యశాఖల ఈఎన్‌సీలు , జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్‌లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్‌ఐటీ వరంగల్ నిపుణుల సాయంతో మార్చి 19న తనిఖీ నిర్వహించి అవసరమైన పరిక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కమిటిలో స్వతంత్ర వ్యక్తులను కూడా చేర్చాలన్న హైకోర్టు ఆదేశాల ప్రకారం అవసరమైన పరీక్షలు హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ , అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీరులను కమిటీలో చేర్చింది. భవన పతిష్ఠతపై పరీక్షలు నిర్వహించిన స్టాండర్ట్ టెక్నో క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ , భవనం తుప్పుబట్టిన పాంతాల్లో కొంత మేర బలహీనంగానే ఉందని పేర్కొంది. ఉస్మానియా భవనాన్ని ఆసుపత్రిగా వినియోగించడం సురక్షితం కాదని నిపుణులు తేల్చారు.