ద్రౌపది ముర్ము… మరిచిపోయిన చరిత్రకు ప్రతినిధి
చరిత్ర మరిచిపోయిన అనేక గిరిజన తెగల ప్రతినిధి ద్రౌపది ముర్ము.
అతి సాధారణ మహిళ జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వనిత దేశానికి మొదటి గిరిజన తెగకు చెందిన మహిళగా…. నారీమణుల్లో రెండో రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఆమె గురించి అనేక కథనాలు చూసాం. ఆమె ఒడిసా రాష్ట్రానికి చెందిన గిరిజన తెగకు చెందిన వ్యక్తి అని… మంత్రిగా, గవర్నర్ గా పనిచేశారని ..కొన్ని కీలక బిల్లులను వెనక్కి పంపించారని చదువుకున్నాం….
కానీ ఆమె రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తరువాత జాతిని ఉద్దేశించి మాట్లాడారు ..అందులో స్వాతంత్ర పోరాటంలో కొన్ని కీలకమైన గిరిజన తెగలు పోరాడారని వారి స్ఫూర్తి గురించి మాట్లాడారు. మళ్ళీ కొన్ని చరిత్ర పేజీలు తిప్పితే వారి ఎవరు అనే సమాచారం సేకరించాను ..వారి గురించి తెలుసుకుందాం …
1.సంతాల్ తిరుగుబాటు: ఈ గిరిజన తెగ జూన్ 30 1855 లో కన్హ ముర్ము ,చంద్ ముర్ము ,భైరవ ముర్ము, అనే గిరిజన నాయకత్వంలో సుమారు 10000 మంది సంతాల్ తెగ ప్రజలతో ఒక తిరుగుబాటు సమూహాన్ని తయారు చేసి నాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ …నాటి రెవెన్యూ అధికారులు..జమిందారీ వ్యవస్థ.. అవినీతి భూస్వామ్యుల మీద తిరుగుబాటు చేసిన మొదటి తెగగా చరిత్ర లో ఉంది …
2.పాళీక రెబెలియన్ : వీరి చరిత్ర గురుంచి చాలా విషయాల గమనిస్తే …1817 సంవత్సరంలో ఒడిసా ఖుద్ర అనే పేరుతో మొదటి స్వాతంత్ర పోరాట యుద్ధం ఈ తెగతోనే ప్రారంభం అయినట్లు ఆధారాలు ఉన్నాయి.
3. కోల్ట్ రివోల్ట్: నాగపూర్ పరిసర ప్రాంతాల్లో కోలాస్ అనే గిరిజన తెగ 1831 లో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.
4.బిల్ ఉదయం : 1818వ సంవత్సరం బ్రిటిష్ వారు గిరిజన హక్కులను కాలరాస్తూ … బిల్ టెరరర్టీ ని మహారాష్ట్రలోని ఖండేష్ లో ప్రవేశ పెట్టినప్పుడు..గిరిజన నాయకుడు సేవరన్ ఆధ్వర్యంలో భారీ తిరుగుబాటు జరిగింది.. ఆ యుద్ధం లో ఆయనను అత్యంత కిరాతకంగా బ్రిటిష్ వారు హతమార్చారు ….
పై తెగలు కాకుండా అనేక గిరిజన తెగలు ప్రాణలను పణంగా పెట్టి స్వాతంత్ర పోరాటం పోరాడారు. కానీ మనకు మాత్రం కొంత మంది చరిత్రనే నేర్పారు …వీరి అందరి ప్రతినిధిగా ద్రౌపది ముర్ము దేశానికి అతి నూతన సంప్రదాయాన్ని అందిస్తారని కోరుకుంటూ ..
ఆయుధాలు లేవు ..కానీ దేశం కోసం తపన ఉన్న ఇలాంటి తెగల గురుంచి తెలుసుకొని వారి స్ఫూర్తితో జీవితాలను గొప్పగా మార్చుకుందాం.
Dr G అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె