జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో విచారణ పూర్తి
సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో విచారణ పూర్తయ్యింది. ఇన్నోవా కారు నగరంలో తిప్పుతూ కారులోనే మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేసినట్లుగా విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. మొదట మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్లే నడిపినట్లు గుర్తించారు. అత్యాచారం జరిగిన ఇన్నోవా వాహనం వక్ఫ్ బోర్డు చైర్మెన్ ఉల్లాఖాన్ కారుగా పోలీసులు అనుమానించారు. ఈసంఘటన మే28న జరిగితే , మే31న కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు కస్టడీలో నిందితులను విచారించారు. నిందితులు సాదుద్ధీన్ మాలిక్ సహా నలుగురు మైనర్స్‌ని అరెస్ట్ చేసారు.
నేరం నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించారు. రెండు నెలల్లో విచారణ పూర్తిచేసిన అధికారులు 400పేజీల చార్జిషీట్‌ను తయారు చేసారు. ఈ కేసులో కీలకంగా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను, సిసి పుటేజ్, కాల్ సీడీఆర్‌ను తీసుకున్నారు. పోలీసులు పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. కోర్టులో అభియోగ పత్రాల దాఖలుకు రంగం సిద్దంచేస్తున్నారు.