NationalNews

16వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్దం…

Share with

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న(సోమవారం) పోలింగ్ జరుగుతుంది.జూలై 21న(గురువారం) ఫలితాలు వెలువడుతాయి.రాష్ట్రపతి ఎన్నికల కోసం బ్యాలట్ పేపర్లను ఆకుపచ్చ,గులాబీ రంగుల్లో ముద్రించారు. ఓటు వేసే ఎంపీలకు అకుపచ్చ రంగు బ్యాలట్ పేపర్,ఎంఎల్ఎలకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్ ఇస్తారు. ఒక్కొక్క ఎంపీ ఓటు విలువ 700 కాగా… ఎంఎల్ఎ ఓటు విలువ సంబంధిత రాష్ట్ర జనాభాను బట్టి ఉంటుంది. ఓటు విలువను బట్టి లెక్కించడానికి వీలుగా వేర్వేరు రంగుల్లో ఈ బ్యాలట్ పేపర్ల ను ఉపయోగిస్తారు.అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో ఎంపీలు,ఎంఎల్ఎలు తమ ప్రాధాన్యతను నమోదు చేయాలి. ఎన్‌డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, పతిపక్షాల అభ్యర్ధిగా యంశ్వంత్ సిన్హా పోటిపడుతున్నారు. ఎంఎల్‌సీలు, నామినేటెడ్ ఎంపీలకు,నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన ఓట్ల విలువ అంటే మెజారిటి మార్క్ 5,43,216 కాగ ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధి ముర్ముకు మద్దతునిస్తూన్న పార్టీలకు ఉన్న విలువ 6,63,634. ప్రతిపక్షాల అభ్యర్ధి యంశ్వంత్ సిన్హాకి 3,92,551 మాత్రమే.